రాయదుర్గం: గుమ్మగట్ట రోడ్డులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
రాయదుర్గం పట్టణంలోని గుమ్మగట్ట రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు, ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. 75 వీరాపురం గ్రామానికి చెందిన స్వరూప్ నాయక్ బైక్‌పై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న భూతయ్య దొడ్డి గ్రామానికి చెందిన మంజునాథ, రోహిత్ ల బైక్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో స్వరూప్ నాయక్, మంజునాథను మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తరలించారు.