సంతనూతలపాడు: చీమకుర్తి మండలం రామతీర్థం గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో కూలి మృతి
చీమకుర్తి మండలం రామతీర్థంలో గల గ్రానైట్ క్వారీలో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. భారీ గ్రానైట్ రాళ్లను లోడ్ చేసే వాహనం కిందపడి వెంకటేష్ అనే కూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తరచూ గ్రానైట్ క్వారీల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటూ.. కూలీలు మృతి చెందుతున్నప్పటికీ గ్రానైట్ క్వారీల యజమానులు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.