కనిగిరి: పామూరు లోని ఆలయాల భూముల్లో అక్రమ కట్టడాలను జెసిబి యంత్రాలతో తొలగించిన దేవాదాయ శాఖ, పోలీస్ అధికారులు
పామూరు పట్టణంలో కొలువైన శ్రీ వల్లి భుజంగేశ్వర స్వామి ఆలయం మరియు శ్రీ మదన వేణుగోపాలస్వామి ఆలయ భూముల్లో అక్రమ కట్టడాలను బుధవారం పోలీస్ మరియు దేవాదాయ శాఖ అధికారులు తొలగించారు. ఆలయ భూముల్లో కొందరు అక్రమ కట్టడాలను నిర్మించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దేవాదాయ శాఖ అధికారులు పోలీసుల సహకారంతో జెసిబి యంత్రాలతో వాటిని తొలగించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహ బాబు మాట్లాడుతూ... ఆలయ భూముల్లో అక్రమంగా కట్టడాలను నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.