కనిగిరి: యడవల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి మండలం యడవల్లి గ్రామంలో కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను భారీగా పెంచి లబ్ధిదారులకు అందజేస్తున్నారన్నారు. పెన్షన్లు పొందిన లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసిల్దార్ జయలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి జైనులాబ్దిన్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.