రాప్తాడు: రాప్తాడు పంచాయతీని ప్లాస్టిక్ రహిత పంచాయతీగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తాం. రాప్తాడు ఎంపీడీవో విజయలక్ష్మి పిలుపు
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో శనివారం 11:30 గంటల సమయంలో రాప్తాడు ఎంపీడీవో విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో విజయలక్ష్మి మాట్లాడుతూ రాప్తాడు పంచాయతీని సంపూర్ణ ప్లాస్టిక్ రహిత పంచాయతీగా మార్చడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగించడం వల్ల ప్రజలకు కలిగే నష్టాల గురించి ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని ప్రజలంతా ప్లాస్టిక్ నిర్మూలించేందుకు సహకారం అందించాలని రాప్తాడు ఎంపీడీవో విజయలక్ష్మి పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో అశోక్ బాబు ప్రజలు పాల్గొన్నారు.