ఉరవకొండ: బెలుగుప్పలో వైభవంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన రథోత్సవ కార్యక్రమం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ విరుపాక్షేశ్వర స్వామి ఆశ్రమం నందు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన రథోత్సవ కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. ఆశ్రమ పీఠాధిపతులు ఈశ్వర స్వామి రథోత్సవానికి తొలి పూజలు నిర్వహించి ప్రారంభించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి 8 గంటల వరకు పురవీధుల గుండా రథోత్సవాన్ని భక్తులు ఊరేగింపు నిర్వహించారు. రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బెలుగుప్ప ఎస్ఐ శివ సిబ్బందితో రథోత్సవంలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఉత్సవం సందర్భంగా ఆలయం వద్ద నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.