కనిగిరి: విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి: గుంటుపల్లి లో మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాసరావు, సంజీవి
పెదచెర్లపల్లి మండలంలోని గుంటుపల్లి లో మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాసరావు, సంజీవి శుక్రవారం పర్యటించారు. విద్యార్థుల ఎన్రోల్మెంట్ స్పెషల్ డ్రైవ్ లో వారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థును ప్రాథమికోన్నత పాఠశాలలో ఎన్రోల్మెంట్ చేయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందించేందుకు చర్యలు తీసుకుంటుంది అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చాలని ఎంఈఓ లు సూచించారు.