కొండపి: జరుగుమల్లి పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సింగరాయకొండ సర్కిల్ సీఐ హజరతయ్యా
ప్రకాశం జిల్లా జరుగుమల్లి పోలీస్ స్టేషన్ ని సోమవారం సింగరాయకొండ సర్కిల్ సిఐ హజరతయ్యా ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్రైమ్ రిపోర్ట్ పరిశీలించి నేరాల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలను పోలీసు సిబ్బందికి సూచించారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిఐ సూచించారు. తర్వాత పోలీసు సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.