కొండపి: కూచిపూడి గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని కూచిపూడి గ్రామంలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సాయంత్రం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి మంత్రి పెన్షన్లు పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటవ తేదీలోపే లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నట్లు మంత్రి అన్నారు. ఫిబ్రవరి 1న సెలవు కావడంతో ఒక్కరోజు ముందుగానే లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు అందించామన్నారు.