కొండపి: మర్రిపూడి మండలం శివరాయునిపేట గ్రామానికి చెందిన 15 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరిక
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం మంత్రి స్వామి సమక్షంలో మర్రిపూడి మండలం శివరాయునిపేటకు చెందిన 15 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వీరికి మంత్రి స్వామి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందంగా ఉండాలని మంత్రి అన్నారు.