కొండపి: టంగుటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు పై పోలీసులకు ఫిర్యాదు చేసిన టిడిపి నాయకులు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చేతలవాడ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు నాయుడును అంబటి రాంబాబు అకారణంగా దూషించాడని నిరసనగా పోలీస్ స్టేషన్ల ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాంబాబు ఒక మంత్రిగా చేసి బజారు వ్యక్తులా మాట్లాడటం సమంజసం కాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.