కొండపి: విషయాన్ని డైవర్ట్ చేయడానికి వైసిపి ప్రయత్నిస్తుంది: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించే రాజకీయాలు చేస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి స్వామి ఆదివారం మధ్యాహ్నం మాట్లాడుతూ.. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. జగన్ ప్రభుత్వం కేవలం కాసుల కక్కుర్తితోనే పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేశారన్నారు.