కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాకి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడం ఎంతో కీలకం: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడం ఎంతో అవసరమని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. సోమవారం ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి స్వామి.. రాబోయే రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అత్యధికంగా నిధులు కేటాయిస్తామన్నారు. సీఎం చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నారని ఉత్సాహవంతమైన అధికారులు అందుకు కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.