సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు లో అధ్వాన స్థితిలో పబ్లిక్ టాయిలెట్లు, దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో లైబ్రరీ సెంటర్లో పబ్లిక్ మరుగుదొడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఆ ప్రాంతంలోకి వెళ్తే భరించలేని కంపు కొడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరుగుదొడ్లు అధ్వాన స్థితిలో ఉండటం వల్ల మూత్ర విసర్జన చేసే వాళ్లు చెరువు చుట్టూ చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.