కనిగిరి: టిడిపి కార్యాలయ నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: ఒంగోలు పార్లమెంట్ టిడిపి కార్యాలయ నిర్మాణ పనులను ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు. కార్యాలయ నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశించారు. స్థానిక నాయకులు కార్యాలయ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.