సంతనూతలపాడు: మద్దిపాడు మండలం ఏడు గుండ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం, ట్రావెల్స్ బస్సు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి
మద్దిపాడు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందిన సంఘటన మద్దిపాడు మండలం ఏడు గుండ్లపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏడు గుండ్లపాడు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు డ్రైవర్లు తమ వాహనాలు దిగి గొడవ పడుతున్నారు. ఇదే సమయంలో వేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు... లారీని ఓవర్ టేక్ చేయబోయి రోడ్డుపై గొడవ పడుతున్న డ్రైవర్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, మరో డ్రైవర్ ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.