ఉరవకొండ: గంగవరం లో నిర్వహించిన హెల్త్ క్యాంప్ లో వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించిన వైద్యాధికారిని హిమబిందు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండల పరిధిలోని గంగవరం గ్రామ హెల్త్ వెల్నెస్ సెంటర్ నందు శుక్రవారం పి హెచ్ సి బెలుగుప్ప డాక్టర్ T. ప్రియాంక మేడం ఆదేశాల ప్రకారం ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం (104) క్యాంపులో వైద్యాధికారిని హిమబిందు మేడం మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు రక్తపోటు, రక్తహీనత, చక్కర వ్యాధి సంబంధించి రక్త పరీక్షలు చేసి వారికి కావలసిన నెలసరి మందులు ఇవ్వడం జరిగినది. ముఖ్యంగా పోషణ అభియాన్ గురించి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఆరోగ్య సలహాలు తెలియజేసారు.. ముఖ్యంగా వడదెబ్బపై అవగాహన కల్పించడం జరిగినది. ఉదయం 10 నుండి 4 గంటల వరకు ఎండలో తిరగరాదన్నారు.