కనిగిరి: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో వసతుల తోపాటు నాణ్యమైన విద్య: మార్కాపురం జిల్లా డిఈఓ సుబ్బారావు
కనిగిరి: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మరియు నాణ్యమైన విద్యను అందిస్తుందని మార్కాపురం జిల్లా డిఈఓ సుబ్బారావు అన్నారు. కనిగిరి పట్టణంలో శనివారం బడి పిలుస్తుంది అవగాహన కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులతో కలిసి ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులను ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు.