కనిగిరి: పామూరులో శ్రీ మదన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా స్వామివారి వసంతోత్సవ కార్యక్రమం
పామూరు పట్టణంలో కొలువైన శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి వసంతోత్సవ కార్యక్రమాన్ని వేదపండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పల్లకి సేవోత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో నరసింహా బాబు, భక్తులు పాల్గొన్నారు