రాప్తాడు: చిన్నంపల్లి లో దళితులు ఇళ్ల పట్టాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే పోరాటం చేస్తాం ఏపీ ఎమ్మార్పీఎస్ దాస్ హెచ్చరిక
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్నంపల్లి వద్ద సోమవారం నాలుగు గంటల సమయంలో ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దాస్ దళిత సంఘం నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా బీసీ ఆర్ దాస్ మాట్లాడుతూ చిన్నంపల్లి వద్ద 16 సంవత్సరాల క్రితం 302 మందికి అప్పటి కలెక్టర్ దుర్గా దాస్ పట్టాలు మంజూరు చేయడం జరిగిందని అయితే చిన్నంపల్లి అర్జునప్ప మాల రవి మరికొంతమంది ఈ ఇంటి పట్టాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ ఉన్న బోర్డులు కూడా తొలగించడం జరిగిందని ఇలాంటి వారిపై కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏపీ ఎంఆర్పిఎస్ బిసిఆర్ దాస్ డిమాండ్ చేశారు.