సంతనూతలపాడు: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితుల అరెస్ట్, 8 బైకులు స్వాధీనం: సంతనూతలపాడు లో ఒంగోలు రూరల్ సీ ఐ శేషగిరిరావు
సంతనూతలపాడు: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఒంగోలు రూరల్ సీఐ శేషగిరిరావు, సంతనూతలపాడు ఎస్సై అజయ్ బాబులు తెలిపారు. సోమవారం సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సంతనూతలపాడు లో బైక్ చోరీలు జరుగుతున్నట్లు ఫిర్యాదు అందగా కేసు నమోదు దర్యాప్తు చేపట్టామన్నారు. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద 8 బైకులను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.5 లక్షలు ఉంటుందన్నారు.