ఉరవకొండ: మలేరియా వ్యాధులపై అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ఐదో సచివాలయం చెందిన శివరాం రెడ్డి కాలనీలో గల బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు శనివారం నాడు జరిగిన మలేరియా వ్యతిరేక మాస ఉత్సవ ర్యాలీ అవగాహన సమావేశం. ప్రిన్సిపల్ జ్ఞాన ప్రసూన, వైస్ ప్రిన్సిపాల్ మంజుల ఉపాధ్యాయులతో కలిసి ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి విద్యార్థులకు దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. దోమల కొట్టకుండా దోమతెరలు వాడాలని వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని తప్పకుండా డ్రైడే పాటించాలని పేర్కొన్నారు.