ఉరవకొండ: ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు గ్రహీత ఎం. శ్రీనివాసులుకు ఘన సన్మానం
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ లైబ్రరీలో లైబ్రేరియన్ గా పనిచేస్తున్న ఎం శ్రీనివాసులు ఇటీవల ప్రభుత్వం ఉత్తమ లైబ్రేరియన్ అవార్డు అందజేయడం జరిగింది. అవార్డు అందుకున్న సందర్భంగా లైబ్రేరియన్ శ్రీనివాసులు గారికి వజ్రకరూర్ లైబ్రరీ కార్యాలయం నందు సోమవారం శాలువాలు పూలమాలలతో వేసి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వజ్రకరూర్ మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ మోనాలిసా,చాబాల మాజీ సర్పంచ్ జగదీష్,అంబేద్కర్ అవార్డు గ్రహీత బెంజిమెన్,పౌరసరఫరా శాఖ కంప్యూటర్ ఆపరేటర్ శాలిని,ప్రాథమిక పాఠశాల చైర్మన్ శాంతి వర్ధన్,సుకుమార్,లత్తవరం గోవిందు తదితరులు పాల్గొన్నారు.