ఉరవకొండ: *ఎస్ఐఆర్ ను త్వరితగతిన పూర్తి చేయాలి*
- డి ఆర్ ఓ మాలోల
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో గురువారం డి ఆర్ ఓ మాలోల బిఎల్ఓ లు , మండల అధికారులు, రాజకీయ పార్టీల నాయకులతో సర్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను బి ఎల్ ఓ లు త్వరితగతిన పూర్తి చేయాలని, వచ్చే మూడు రోజులపాటు క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ ను మండల అధికారులు వేగంగా చేయించాలన్నారు. వచ్చే 12వ తేదీ నాటికి ఎస్ఐఆర్ ను పూర్తి స్థాయిలో చేసేలా చూడాలన్నారు. ఇందులో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను పూర్తి చేయాలన్నారు.