ఉరవకొండ: పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయినీలను బంగారు వర్ణ రథం లో ఊరేగింపు
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గడేకల్లు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లుగా విద్యాసేవలందించి బుధవారం పదవి విరమణ పొందిన ఉపాధ్యాయినీలు పద్మభవాని,సాయి కుమారిలను ఎంపిపి కరణం పుష్పావతి భీమరెడ్డి మరియు ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి,జ్ఞాపికలను అందజేసి,శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ పుస్తకాలలోని పాఠాలతోపాటు,జీవిత పాఠాలు నేర్పే గురువుల సేవలు విద్యార్థుల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయన్నారు. అనంతరం బంగారు వర్ణం గల గుర్రాల రథంలో ఉపాధ్యాయులను ఘనంగా ఊరేగింపు చేశారు.