ఉరవకొండ: కొనకొండ్ల గ్రామంలో ఈతకు వెళ్లి పదవ తరగతి విద్యార్థి మృతి
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో పదవ తరగతి విద్యార్థి ప్రవీణ్ సరదాగా మరికొందరు స్నేహితులతో కలిసి శుక్రవారం గ్రామ సమీపంలోని రస సిద్దుల గుట్ట సమీపంలోని కుంటలోకి ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. ప్రమాదవ శాత్తు నీట మునిగిన ప్రవీణ్ ను గ్రామానికి చెందిన కొందరు నీటి కుంటలో గాలింపు చేపట్టి బయటికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే విద్యార్థి ప్రవీణ్ మృతి చెంది ఉన్నట్టు గుర్తించారు. గ్రామంలో విద్యార్థి మృతి చెందడంతో విషాదం నెలకొంది.