కనిగిరి: పట్టణంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు
కనిగిరి పట్టణంలో మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బిఎల్వోలు చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి. వారికి పలు సూచనలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమానికి సంబంధించి మూడు రోజులే గడువు మిగిలి ఉన్నందున, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను నూరు శాతం పూర్తిచేయాలని బిఎల్ఓ లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీధర్. పట్టణ టిడిపి అధ్యక్షులు ఫిరోజ్ పాల్గొన్నారు.