ఉరవకొండ: పురుగుల మందు సేవించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
అనంతపురం జిల్లా బెలుగుప్ప తాండా గ్రామానికి చెందిన మూడ్ సురేష్ నాయక్ (29) అప్పుల బాధలు తాళలేక తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు సేవించి చికిత్స పొందుతూ మృతి చెందాడని బెళుగుప్ప పోలీస్ స్టేషన్ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు మీడియా ప్రతినిధులకు ప్రకటనలో పేర్కొన్నారు. మృతుడు సురేష్ ఫైనాన్స్ లో ఒక ఆటొ కొనుకొని జీవిస్తూ ఉండగా భార్య అనారోగ్యం ఖర్చులు ఫైనాన్స్ కంతులు, ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకున్న డబ్బులు అన్నీ కలిసి సుమారు 20 లక్షల వరకు అప్పు అయ్యాయి. అప్పులు తీర్చలేక మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని గజనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.