ఉరవకొండ: పట్టణంలోని RWS కార్యాలయం వద్ద యువకుడి హల్చల్, నీటి సంపులో తల్లి దూకిందంటూ తప్పుడు సమాచారంతో పోలీసులు గాలింపు
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ఆర్ డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద శనివారం యువకుడి హల్చల్ చేసి , నీటి సంపులో తల్లి దూకిందంటూ పోలీసులకు తప్పుడు సమాచారం అందించి కొన్ని గంటల పాటు పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చేపట్టే విధంగా యువకుడు హరినాథ్ హల్ చల్ చేశాడు. పోలీసులు గాలింపు చర్యలు ఎలాంటి ఫలితం లేకపోవడంతో తర్వాత విచారణ కొనసాగించి యువకుడి తల్లి అయినా ఆ మహిళ వేరే ఊరిలో క్షేమంగా ఉన్నట్లు నిర్ధారణ చేసుకున్న పోలీసులు హల్చల్ చేసిన యువకుడు హరినాథ్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. *మీ సాక్షి టీవీ లో...*