కనిగిరి: స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో శనివారం కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీధర్, సచివాలయ, మున్సిపల్ ఉద్యోగులతో కలిసి పట్టణంలోని మంచినీటి దొరువు వద్ద పరిసరాలు పరిశుభ్రం చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.