రాప్తాడు: అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం దోపిడీ చేస్తుంది అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విమర్శలు
అనంతపురం జిల్లా కేంద్రంలో శ్రీనగర్ కాలనీ వద్ద రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి నివాసంలో శనివారం 11:30 గంటల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు ఆయన ఎమ్మెల్యేలు అనుచరులంతా దోపిడీ చేసేందుకే తెర లేపడం జరిగిందని వాటిని ప్రశ్నిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ టీవీని అడ్డుపెట్టుకుని అసత్య ఆరోపణలు కథనాలు ప్రశ్నిస్తున్నారని ఇలాంటి వారికి రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెపుతారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు.