ఉరవకొండ: దళితులకు జడ్పీ చైర్మన్ పదవిని ఎన్నికలలో కేటాయించాలి : ఎమ్మార్పీఎస్
అనంతపురం జిల్లా ఉరవకొండ లోని ఆర్ అండ్ బి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లాలో దళితుల జనాభా అధికంగా ఉన్నప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జడ్పీ చైర్మన్ పదవి మాదిగలకు కేటాయించలేదని రాబోయే ఎన్నికలలో జడ్పీ చైర్మన్ పదవిని ఎస్సీ మాదిగలు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ శనివారం పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం భూమిలేని పేదలను గుర్తించి 8వ విడత భూపంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరారు.ఇటీవల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా జిల్లాలో కొన్ని చోట్ల ఊరేగింపులను అడ్డుకున్న ఘటనలను ఖండిస్తూ, బాధ్యులపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలన్నారు.