ఉరవకొండ: ఒంటరితనం భరించలేక తీవ్ర మనస్థాపానికి గురై విషపు గుళికలు మింగి వ్యక్తి ఆత్మహత్య
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు ఒంటరితనాన్ని భరించలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని బెలుగుప్ప ఎస్సై శివ సోమవారం సాయంత్రం పేర్కొన్నారు. ఆంజనేయులు(42) ఆర్టీసీ కాంట్రాక్ట్ డ్రైవర్ ఉద్యోగిగా ఉంటూ ఇటీవల బస్సుకు ప్రమాదం జరగడంతో విధుల నుంచి తొలగించారని మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సైతం అనారోగ్యంతో మృతి చెందిందని దీంతో ఒంటరితనాన్ని భరించలేక ఆదివారం విషఫుగుళికల మ్రింగి చికిత్స పొందుతూ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాదన్నారు. ఘటనపై మృతుని సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.