సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం నిడమానూరులో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
నాగులుప్పలపాడు మండలం నిడమానూరులో జనసేన పార్టీ మరియు క్రిస్టియన్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి ఆయన కొద్దిసేపు సరదాగా క్రికెట్ ఆడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.... క్రీడలు శారీరక వికాసానికి, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, ఓడినా, గెలిచినా క్రీడాకారులు తమ క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.