కనిగిరి: నేలటూరి గొల్లపల్లి చెరువుకు గండి, వృధాగా పోతున్న నీరు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలతో గండిని పూడ్చిసిన అధికారులు
కనిగిరి మండలంలోని నేలటూరి గొల్లపల్లి చెరువుకు గండిపడింది. దీంతో నీరు వృధాగా పోతూ ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ అధికారులు స్థానిక టిడిపి నాయకులతో కలిసి జెసిబి యంత్రాలతో, ట్రాక్టర్లతో పనులు చేపట్టి మట్టితో గండిని పూడ్చివేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.