కనిగిరి: స్వీయ జనగణన పై ప్రజలకు అవగాహన కల్పించాలి: వెలిగండ్ల లో కనిగిరి ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి
వెలిగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనగణన పై ఎన్యుమరేటర్లు మరియు మండలస్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని కనిగిరి ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ... స్వీయ జనగణన పై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సెన్సెస్ పోర్టల్ లో ప్రజలు స్వయంగా జనగణన నమోదు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈనెల 30 లోపు ఈ ప్రక్రియ పూర్తయితే మే 1 నుండి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి స్వీయ జనగణపై పరిశీలన చేయవలసిన అవసరం ఉంటుందన్నారు.