కనిగిరి: వెలిగొండ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలి: కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్
కనిగిరి: వెనుకబడిన మార్కాపురం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టు వరప్రసాదిని ఇలాంటిదని, రాష్ట్ర ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. మార్కాపురంలో సోమవారం జరిగిన వెలిగొండ ప్రాజెక్టు, కృష్ణా జలాల సాధన పై వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కనిగిరి నియోజకవర్గం వెనుకపాటుకు గురైన ప్రాంతమని వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందితేనే ఇక్కడి రైతులకు పంటలు పండుతాయి అన్నారు.