రాప్తాడు: బొమ్మపర్తి గ్రామంలో వన్ మంత్ వన్ విలేజ్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మ ప్రతి గ్రామంలో గురువారం మూడు గంటల సమయంలో వన్ మంత్ వన్ విలేజ్ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మార్వో విజయ్ కుమారి ఆర్డిఓ కేశవ నాయుడు తదితరులు పాల్గొని బొమ్మపర్తి గ్రామంలో రెవిన్యూ సంబంధించిన సమస్యల గురించి స్థానిక గ్రామస్తులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కేశవ నాయుడు మాట్లాడుతూ బొమ్మపర్తి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు వన్ మంత్ వన్ విలేజ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ గ్రామంలో రెవిన్యూ సమస్యలను కూడా తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు పేర్కొన్నారు.