రాప్తాడు: ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాటాలు చేస్తాం ఎస్కే యూనివర్సిటీ ఏఐటీయూసీ సమావేశంలో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో ఇటికలపల్లి వద్ద మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్కే యూనివర్సిటీ ఆటో యూనియన్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాజేష్ గౌడ్ ,చిరంజీవి, తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆటో డ్రైవర్ల పై తగ్గించాలని ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సమస్యలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి కార్మికుల సమస్యలపై పోరాటాలు చేస్తామని జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి తదితరులు డిమాండ్ చేశారు.