కనిగిరి: పట్టణంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
కనిగిరి పట్టణంలో ఒంగోలు బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద నుండి కొనసాగి చర్చి సెంటర్ మీదుగా ఒంగోలు బస్టాండ్ వద్దకు చేరుకుంది. ర్యాలీ కార్యక్రమంలో ఎస్సీ,, ఎస్టీ ,బీసీ, మైనారిటీ సంఘాల నాయకులు, కనిగిరి నియోజకవర్గం ప్రజలు భారీగా పాల్గొన్నారు.