సంతనూతలపాడు: మండల స్థాయి అధికారులతో ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సంతనూతలపాడు ఎంపీడీవో సురేష్ బాబు
సంతనూతలపాడు ఎంపీడీవో కార్యాలయంలో బాలిక వికాసం 2026 పై మండల స్థాయి అధికారులతో సంతనూతలపాడు ఎంపీడీవో సురేష్ బాబు శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కిషోర్ బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సంరక్షణ వంటి చర్యలు కల్పించవలసిన అవసరం ఉందన్నారు. బాల్యవివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత మండల స్థాయి అధికారులు అందరిపై ఉందన్నారు.