సంతనూతలపాడు: మద్దిపాడు లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల వైఫల్యాల పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన మాజీమంత్రి నాగార్జున
మద్దిపాడు లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల వైఫల్యాలపై సంతనూతలపాడు వైసిపి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఎన్నికల హామీలు, మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది అన్నారు. వైసీపీ శ్రేణులు ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.