రాప్తాడు: పుట్టపర్తిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి వెంకటాపురంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపు
సత్య సాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో గురువారం ఐదున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం పుట్టపర్తిలో ఐదోతరం యుద్ధ విమానాలు తయారీ చేయబోయే కర్మాగారానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ఐదో తరం యుద్ధ విమానాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయబోతున్నారని ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు.