కనిగిరి: పట్టణంలో ఏఐటీయూసీ మార్కాపురం జిల్లా మహాసభ సందర్భంగా ఎర్రజెండాలతో భారీ ర్యాలీ చేపట్టిన కార్మికులు
కనిగిరి పట్టణంలో మార్కాపురం జిల్లా ఏఐటియుసి ప్రధమ మహాసభ సందర్భంగా బుధవారం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు యాసిన్ ఆధ్వర్యంలో కార్మికులు కదం తొక్కారు. పట్టణంలోని పివిఆర్ పార్క్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ఎర్రజెండాలను చేత బూని కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.