కనిగిరి: రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్తను వేస్తే చర్యలు: వెలిగండ్ల ఎంపీడీవో గంగాధర్ హెచ్చరిక
వెలిగండ్ల మండలం మొగులూరు లో గురువారం ఎంపీడీవో గంగాధర్ సిబ్బందితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్తను వేస్తే జరిమానా తో పాటు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో హెచ్చరించారు. మన ఇళ్లను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామాభివృద్ధికి పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని, ఇళ్ల వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసి అందించాలని ఎంపీడీవో సూచించారు.