కనిగిరి: పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు, ఇబ్బందులు పడ్డ స్థానిక ప్రజలు ,వాహనదారులు
కనిగిరి పట్టణంలో ప్రధాన కూడలి అయిన నాజ్ సెంటర్ నందు రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమౌతుంది. సోమవారం నాజ్ సెంటర్ నందు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులు ఇరుకుగా ఉండడం, వాహనాల సంఖ్య ఎక్కువ కావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.