రాప్తాడు: రామగిరి మండల కేంద్రంలో 15 మందికి 14 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో శనివారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరి చెన్నై కొత్తపల్లి కనగానపల్లి మండలాలకు చెందిన 15 మందికి 14 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రామగిరి మండల కేంద్రంలో రామగిరి కనగానపల్లి చెన్నై కొత్తపల్లి మండలాలకు చెందిన 15 మందికి 14 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది భవిష్యత్తులో ఎన్టీఆర్ వైద్య సేవలు అందుకునే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.