ఉరవకొండ: ఈదురు గాలులతో కూడిన వర్షానికి కుదేలైన ఉద్యాన పంటలు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్దకోకుంట్ల గ్రామంలో రైతులు ధనుంజయ 5 ఎకరాలు సుబ్బరాయుడు 2.5 ఎకరాలు భీమ లింగ మూడు ఎకరాలు అరటి తోట గురువారం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి నేలవాలగా లక్షల రూపాయలు ఆస్తి నష్టం సంభవించిందని రైతులు వాపోయారు. ఇదే గ్రామానికి చెందిన సుంకమ్మ అనే మహిళకు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో కోత దశలో ఉన్న కాయలన్నీ నేల రాలిపోగా ఈ 50వేల రూపాయలకు పైగా ఆశించడం జరిగింది. ప్రభుత్వం నష్టపరిహారం అంచనా వేయించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.