కనిగిరి: పామూరు మండలం మోపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం, గుర్తుతెలియని వాహనం ఢీకొని సర్వేయర్ మృతి
పామూరు: గుర్తుతెలియని వాహనం ఢీకొని సర్వేయర్ మృతి చెందిన సంఘటన పామూరు మండలం మోపాడు సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పామూరు పట్టణంలో సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్న పవన్ కుమార్ మోటార్ బైక్ పై వెళ్తుండగా మోపాడు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సర్వేయర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.