కనిగిరి: పట్టణంలో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు దాతల సహకారం అభినందనీయం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు దాతలు అందిస్తున్న ఆర్థిక సహకారం అభినందనీయమని కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు పలువురు అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డికి ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. కార్యక్రమంలో అంబేద్కర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.